పొజిషన్ మార్చుతుండాలి..
కంప్యూటర్, ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకు ఒక సారి వారి పొజిషన్ మారుతూ రిలాక్స్ అవ్వాలి. మోకాళ్లు, పక్కటెముకలు కనీసంగా 90 డిగ్రీలు పొజిషన్‌లో ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచుతూ పనిచేయాలి. ఏదైనా సమస్య వస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ ఎస్.వి.రాజేష్, ఆర్థోపెడిక్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి
రాత్రిపూట మానుకోవాలి
అదే పనిగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో పనిచేసే వారికి ప్రధానంగా కళ్ల సమస్యలు అతి వేగంగా వస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పనిచేసి కళ్లకు ఒత్తిడి పెంచడం మంచిది కాదు. ప్రతి గంటకు ఒక సారి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవాలి. కళ్లకు సంబందించి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుల సలహాలను తీసుకోవాలి.
– డాక్టర్ ఎ.శ్రీరాములు, కంటి వైద్య నిపుణుడు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి
●
భంగిమను గమనిస్తుండాలి.
● సాధారణంగా తల బరువు నాలుగైదు కిలోలు ఉంటుంది. తలను మెడపై సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాకాకుండా తరచూ ముందుకు, వెనక్కి వంచి ఉంచడం మెడ మీద అదనపు భారం పడుతుంది. దీనివల్ల క్రమంగా మెడనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
● అలాగే పడుకుని ఎత్తైన దిండు తలకింద పెట్టుకుని ల్యాప్‌టాప్, మొబైల్ చూస్తుంటారు. దీని వల్ల కూడా సమస్యలు తప్పవు. కళ్లకు నిటారుగా స్క్రీన్ ఉండేలా చూసుకుంటే మెడ పొజిషన్ ఆటోమేటిక్‌గా నిటారుగా ఉంటుంది.
● టైప్ చేయడం కోసం వేళ్లను ఎక్కువగా కదిలించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు వేళ్లపై ఎక్కువ భారం పడకూడదంటే ప్రతి అరగంటకోసారి వేళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.
● గంటల తరబడి వర్క్ చేసేటప్పుడు ఏదైనా అవయవంపై ఒత్తిడి పడినట్టు గమనిస్తే.. శరీరం పొజిషన్ తప్పుగా ఉందని అర్థం చేసుకోవాలి. అవయవాలు ఒత్తిడికి లోనవ్వకుండా, కళ్లు ఒత్తిడికి గురి కాకుండా పనిచేయడం అలవాటు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment