నరకయాతన
గంటలు
రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో ప్రయాణికులు సుమారు ఆరుగంటల పాటు మండుటెండలో నరకయాతన అనుభవించారు. జి.సిగడాం మండలం ధవళపేట గ్రామ సమీపంలో ఇటీవల కల్వర్టు పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డులో శనివారం ఉదయం 5 గంటల సమయంలో భారీ లోడుతో వస్తున్న ఓ లారీ కూరుకుపోయింది. ఉదయం 11 గంటల వరకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో వాహనచోదకులు అవస్థలు పడ్డారు. ఎస్‌ఐ వై.మధుసూదనరావు, రహదారులు, భవనాల శాఖ ఏఈఈ పి.టి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని యంత్రాల ద్వారా లారీని బయటకు తీయడంతో రాకపోకలు పునరుద్ధరణ జరిగాయి. – జి.సిగడాం
నరకయాతన
నరకయాతన
నరకయాతన
నరకయాతన
నరకయాతన
Comments
Please login to add a commentAdd a comment