పెండింగ్ కేసుల్లో దర్యాప్తు ముమ్మరం
శ్రీకాకుళం క్రైమ్ : ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ పెండింగ్ కేసులపై దర్యాప్తు ముమ్మరం చేయాలని జిల్లా అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు సూచించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేవ్ కేసుల దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో పారదర్శకంగా దర్యాప్తు సాగాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, వి.వి.అప్పారావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment