
డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు వర్సిటీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నెల 13వ తేదీలోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 25 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేసి, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష ఫీజును సోమవారం నుంచి 14వ తేదీ మధ్య చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు.
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామికి ఆదివారం ఉదయం నుంచి విశేష పూజలను నిర్వహించారు. మాఘమాసం మూడో ఆదివారం సందర్భంగా స్వామి వారి మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించా రు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత కారణంగా మజ్జిగ పంచారు. ఒక్క రోజులో వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.3,77,100, విరాళాలు, ప్రత్యేక పూజల ద్వారా రూ.68,837, ప్రసాదాల వి క్రయాల ద్వారా రూ. 1.74 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈఓ తెలిపారు.
జామియా మసీదులో ఇఫ్తార్ విందు
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న జామియా మసీదులో ఆదివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. రంజాన్ మాసం మొదటి రోజున అందరూ కలసి ముందుగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామియా మసీదులో మొదటిసారి తమ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో మసీదు అధ్యక్షుడు మహీబుల్లా ఖాన్, హాజీ భయ్యా, అమీరుల్లా బేగ్, ఉస్మాన్, షకూర్‌ఖాన్, కమిటీ సభ్యులు, ఫజర్ జమాత్ సభ్యులు పాల్గొన్నారు.
అయ్యో.. రైతన్న
కాశీబుగ్గ: పశువుల మేత కోసం మినప తొక్కును పట్టుకుని రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగి ఓ రైతన్న రెండు కాళ్లను కోల్పోయాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పారసాంబ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతు కొల్లకోట రాము ఉదయం పశువుల మేతకు మినపతొక్కు పట్టుకుని రోడ్డు దాటుతుండగా టెక్కలి నుంచి కంచిలికి బైక్‌పై వెళ్తున్న మీనకేథన్ డొలై అనే వ్యక్తి రామును ఢీకొన్నాడు. ప్రమాదంలో రైతు రాముకు రెండు కాళ్లు విరిగిపోయాయి. వాహనదారులు చూసి వెంటనే రైతుకు సపర్య లు చేశారు. పలాస 108 అంబులెన్సు సిబ్బంది సత్యం, నాగేష్, ప్రథమ చికిత్స అందించి పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.

డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment