
వత్సవలసకు పోటెత్తిన భక్తులు
గార: మండలంలోని చిన్న వత్సవలసలో కొలువున్న రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి మాఘ మాసం నాల్గో వారం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శనివారం రాత్రికి గ్రామానికి వచ్చిన భక్తులు సమీప తోటల్లోనూ, ఆరు బయట బస చేశారు. ఉదయం సమీప సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించి ముందుగా భూలోకమ్మను, అనంతరం రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి)ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వారం నాటుకోళ్లు, గొర్రెలు సమర్పించడంతో పాటు చిన్నారుల పుట్టుకొప్పులు భక్తులు మొక్కులు ద్వారా చెల్లించారు. ముఖ్యంగా తొలి సంతానాన్ని ఇక్కడికి తీసుకువచ్చి తొలికొప్పు (పుట్టుకొప్పు)ను తీయించి ప్రత్యేకంగా ముడుపులు చెల్లించుకున్నారు. ఈ వారం జాతరకు శ్రీకాకుళం పట్టణ సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో 90 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి వేళ కూడా అదనపు భద్రతా చర్యలు చేపట్టగా 15 మద్యం సీసాలతో పట్టుబడినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

వత్సవలసకు పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment