
సంతానం కలగలేదన్న మనస్తాపంతో..
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని డోకులపాడు గ్రామానికి చెందిన వడ్డి రాజు(32) సంతానం కలగలేదన్న మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రాజుకు 12 ఏళ్ల క్రితం రాజ్యంతో వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఎప్పటిలాగే కూలి పనులు చేసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి తన గదిలో పడుకునేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా ఇంట్లో ఉన్న సూపర్ వాస్మిన్–33 నూనె తాగేశాడు. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న రాజును కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నిహర్ తెలిపారు.
యువకుడు బలవన్మరణం
డోకులపాడులో విషాదం
Comments
Please login to add a commentAdd a comment