రమ్య తిరుమలను సందర్శించిన చిన్నజీయర్ స్వామి
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి రోడ్డులోని రమ్య తిరుమల ఆలయాన్ని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కరి రంగనాథ వేణు మాధవాచార్యులు, గిరిజారాణి, దుర్గాప్రసాద్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
8, 9 తేదీల్లో రాయిపూర్‌లో తెలుగు మహాసభలు
పలాస: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయిపూర్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో ద్వితీయ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్టు కమిటీ కన్వీనర్ లండ రుద్రమూర్తి చెప్పారు. ఈ మేరకు ఆదివారం అక్కడి ఆంధ్రా అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సభలకు ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని, తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
క్రేన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
కంచిలి: జాతీయ రహదారి నుంచి కంచిలిలోకి ప్రవేశించే సర్వీస్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కుడిచేయిని కోల్పోయాడు. బూరగాం గ్రామానికి చెందిన కార్పెంటర్ గుజ్జు కృష్ణారావు, స్నేహితుడు కాయ చలపతిరావు, అతని తల్లి కలిసి ఎన్.ఎం.పురం గ్రామానికి బంధువుల పరామర్శకు ఆదివారం వెళ్లారు. వారిద్దరూ అక్కడే ఉండిపోవడంతో కృష్ణారావు నడుచుకుంటూ కంచిలి వైపు వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన క్రేన్ ఢీకొట్టింది. కృష్ణారావు కుడిచెయ్యి పైనుంచి టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జయ్యింది. వెంటనే క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. చెయ్యి పూర్తిగా విరిగిపోవడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. కాగా, కృష్ణారావును ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో హైవేలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. క్రేన్ డ్రైవర్ సింగంశెట్టి శంకరరావు పలాస మండలం బంటుకొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.
ఏపీబీఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్
శ్రీకాకుళం న్యూకాలనీ: బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మెట్ట అశోక్‌కుమార్ ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సంఘ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నాలుగేళ్ల నుంచి అశోక్‌కుమార్ విశేష సేవలు అందిస్తున్నారు. ఈయన హయాంలో శ్రీకాకుళం వేదికగా అండర్–19, అండర్–17 విభాగాల్లో రెండు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీలను విజయవంతంగా నిర్వహించి ప్రసంశలు అందుకున్నారు. అశోక్ ఎన్నిక పట్ల జిల్లా బ్యాడ్మింటన్ సంఘ చైర్మన్ ఆర్.రాజేంద్రన్, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, అధ్యక్షుడు కె.సాగర్, సీఈఓ సంపతిరావు సూరిబాబు, శైలానీ, ప్రసాద్, రత్నాజీ హర్షం వ్యక్తంచేశారు.
యువతి ఆత్మహత్య కేసులో యువకుడు అరెస్టు
సోంపేట: మండలంలోని బారువ కొత్తూరు గ్రామానికి చెందిన వలిశెట్టి తులసి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం తులసితో కలిసి బట్టిగల్లూరు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎం.ప్రదీప్ అని మృతురాలి తండ్రి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి ఎం.ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
రమ్య తిరుమలను సందర్శించిన చిన్నజీయర్ స్వామి
రమ్య తిరుమలను సందర్శించిన చిన్నజీయర్ స్వామి
రమ్య తిరుమలను సందర్శించిన చిన్నజీయర్ స్వామి
Comments
Please login to add a commentAdd a comment