● అలరించిన త్యాగరాజస్వామి కీర్తనలు
జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాజ స్వామి ధ్యాన ఆరాధన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శృతిలయ సంగీత శిక్షణాలయం, ఆనందో బ్రహ్మ బృందాల త్యాగరాజ కీర్తనలు, సుందరంపల్లి శ్రీనివాస్ శాక్సోపోన్ కచేరి, సుసరాపు లక్ష్మీగణపతి శర్మ బృందం త్యాగరాజ కృతుల గానం, దుంపల ఈశ్వరరావు బృందం త్యాగరాజ కీర్తనలు, పంచరత్న కీర్తనల గోష్టి అలరించాయి. కార్యక్రమంలో స్వాతి సోమనాథ్, శ్రీను, డాక్టర్ మాలతి, స్పిరిట్యువల్ పిరమిడ్ మెడిటేషన్ సీఈవో శ్రీదేవి, మావుడూరు శ్రీనివాస శర్మ, త్రివిక్రమదేవ్ తదితరులు పాల్గొన్నారు. – శ్రీకాకుళం కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment