కర్కశంగా..!
కమ్మల
కోసం..
నరసన్నపేట: స్థానిక బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) సోమవారం వేకువజామున దారుణ హత్యకు గురైంది. స్థానికులు, వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వీధిలో ఇళ్ల ముందు పూలు మొక్కల నుంచి పూలు సేకరించి స్థానిక సత్యనారాయణ గుడి వద్ద భక్తులకు అమ్ముతూ గున్నమ్మ జీవనం సాగించేది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆమెకు ఈ పని నిత్యకృత్యమైంది. దీనిలో భాగంగా ఎప్పటిలాగే సోమవారం వేకువజామున పూలు సేకరించి ఇంటి వద్ద నుంచి సత్యనారాయణస్వామి ఆలయానికి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ముక్కు కమ్ముల చోరీకి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కొంత పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. గున్నమ్మ ఇంటి నుంచి ఆలయం వరకూ పూలు రోడ్డుపై పడి ఉన్నాయి. అలాగే ఆమె వస్త్రాలు ఆలయం ముందు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సుమారు మూడు వందల మీటర్ల దూరంలో మృతదేహం గుర్తించారు.
చెడు వ్యసనాలే హత్యకు కారణం..?
కాగా పలుచోట్ల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలో కదలికల ఆధారంగా స్థానిక పురుషోత్తం నగర్‌కు చెందిన ఒక పాత నేరస్తుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన ఒక 20 ఏళ్ల యువకుడు చేసిన పనిగా భావిస్తున్నారు. మద్యం మత్తులో ఈ చర్యలు పాల్పడినట్లు ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వృద్ధురాలి హత్యపై ఆమె కుమారుడు కేవిటి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.
ఈడ్చుకెళ్లి హత్య..?
ఆలయం వద్ద నుంచి వివస్త్ర ఉన్న వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి కామేశ్వరి నగర్ వద్ద ఒక మారుమూల రోడ్డుపై వదిలేశారు. వీపు అంతా బాగా గాయాలై ఉన్నాయి. ఆలయం నుంచి మృతదేహం ఉన్న స్థలం వరకు పలుచోట్ల రక్తం మరకలను పోలీసులు గుర్తించారు. ఉదయం అటుగా వెళ్లినవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న నిందుతుడు వృద్ధురాలిపై అత్యాచారం కూడా చేశాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతదేహం ఉన్న స్థితిని చూసిన స్థానికులు ఈవిధంగా అనుమానిస్తున్నారు. దీంతో ఘటనా స్థలాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్వయంగా పరిశీలించారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్) శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ మూర్తిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
వృద్ధురాలి దారుణ హత్య
గున్నమ్మ(ఫైల్)
కర్కశంగా..!
Comments
Please login to add a commentAdd a comment