సునీల్‌కుమార్‌పై కక్ష సాధింపు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరికాదని అంబేడ్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను అన్నారు. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ఎయిమ్, దళిత సంఘాల జేఏసీ నాయకులు సంయుక్తంగా సోమవారం శాంతియుత నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై వేధింపులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కోరారు. దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ కంఠ వేణు మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణం చూపిస్తూ ఆయనను సస్పెండ్ చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఆయనను పథకం ప్రకారం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి, నెలల తరబడి వీఆర్ లోనే ఉంచుతూ వస్తున్నారని పేర్కొన్నారు. ఇదే పంథాలో కూటమి ప్రభుత్వం కొనసాగితే దళితజాతి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్స్ ఇండియా మిషన్, దళిత సంఘాల జేఏసీ నాయకులు యజ్జల గురుమూర్తి, పురుషోత్తం, రాంబాబు, పెయ్యల చంటి, భూషణ్, అబ్బాస్, కొత్తూరు సత్యనారాయణ, సుంకు రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment