337 మంది గైర్హాజరు
● సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సీనియర్ ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల ఒకటో తేదీన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా.. సోమవారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభమయ్యాయి. సెట్–1 ప్రశ్న పత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒరియా పేపర్లకు పరీక్ష రాశారు. జిల్లా వ్యాప్తంగా 75 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు రెండోరోజు మొత్తం 18,782 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,445 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 337 మంది గైర్హాజరయ్యారు.
తనిఖీలు ముమ్మరం
జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను అధికారులు చుట్టుముడుతున్నారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్, డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు జిల్లాలోని పొందూరు మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిస్టమ్ జూనియర్ కళాశాల, కింతలి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈసీ కమిటీ సభ్యులతో కలిసి ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు పరీక్షకు ముందు శ్రీకాకుళం నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ను సందర్శించారు. అలాగే నగరంలోని చైతన్య సహకార జూనియర్ కాలేజ్, శాంతినికేతన్ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. రెండోరోజు పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment