తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

తిరుగుబాటు

Published Tue, Mar 4 2025 1:44 AM | Last Updated on Tue, Mar 4 2025 1:41 AM

తిరుగ

తిరుగుబాటు

శ్రీకాకుళం
అంతన్నారు.. ఇంతన్నారుడీఎస్సీపై డోలాయమానం కొనసాగుతోంది. అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. –8లో
తొమ్మిది నెలల్లోనే

మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు షాకిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే టీడీపీ, జనసేనకు ఓటమి రుచి చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ మనోభావాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికను టీడీపీ నాయకులు భుజాన వేసుకోవడాన్ని ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అవకాశం ఇస్తే తమకు ఎదురు లేదని నాయకులు విర్రవీగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. తామేంటో చూపిస్తామంటూ ఎన్నికల్లో ఓట్లేసి గట్టిగా దెబ్బ కొట్టారు.

అంచనాలకు తగ్గట్టుగా ‘గాదె’ గెలుపు..

ప్రభుత్వ వ్యతిరేక పవనాల మధ్య ఉపాధ్యాయవ ర్గాల్లో మంచి పట్టు ఉన్న గాదె శ్రీనివాసులునాయు డు బరిలో దిగుతున్నట్టు ప్రకటించినప్పుడే దాదా పు విజయం ఖరారైపోయింది. గతంలో రెండు ఎమ్మెల్సీగా పనిచేసిన తీరు, పీఆర్‌టీయూ సంఘంలో ఐక్యత, సామాజిక వర్గం తదితర విషయాలు గాదెకు కలిసొచ్చాయి. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్ని కను టీడీపీ, జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గ్రామ స్థాయి నాయకుడి దగ్గరి నుంచి మంత్రులు వరకు సీరియస్‌గా పనిచేయడం మరింత ప్లస్‌ అ యింది. ఉపాధ్యాయులను రెచ్చ గొట్టేలా సాధారణ ఎన్నికల మాదిరిగా ప్రచారం చేయడం, తాము మ ద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని ఒత్తిడి చేయడం, పోలింగ్‌ ముందు రోజున ప్రలోభాలకు గురి చేయడం, పోలింగ్‌ రోజున టీడీపీ నాయకులే శిబిరాలు పెట్టి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం వంటి అంశాలు గాదె గెలుపునకు దోహదపడ్డాయి. ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినప్పటికీ వెనక్కి తలొగ్గలేదు.

రఘువర్మ స్వయం కృతాపరాధం

ఏపీటీఎఫ్‌ తరఫున పోటీ చేసిన పాకలపాటి రఘువర్మ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమని నిపుణులు అంటున్నారు. వాస్తవంగా ఏపీటీఎఫ్‌ బలమైన సంఘం. ఉత్తరాంధ్రలో ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. కానీ, టీడీపీ, జనసేన మద్దతుతో పోటీ చేయాలనుకోవడమే ఆయన కొంప ముంచిందనే వాదనవినిపిస్తోంది. వాస్తవంగా, రఘువర్మ సౌమ్యుడనే అభిప్రాయం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఏపీటీఎఫ్‌ తరఫునే పోటీ చేసి ఉంటే బాగుండేదని, కానీ, ఆయన టీడీపీతో కలవడంతో అప్రతిష్టను మూటగట్టుకున్నారని అంటున్నారు. వాస్తవంగా టీడీపీ మద్దతుతో పోటీ చేయాలన్న ఆసక్తి ఏపీటీఎఫ్‌ నాయకుల్లో చాలా మందికి లేదు. తొలుత కొందరు వ్యతిరేకించినట్టుగా కూడా తెలిసింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు తమ వెంట ఉన్నాయని, గెలుపు సాధ్యమవుతుందని హితబోధ చేయడంతో ఏపీటీఎఫ్‌ నాయకులు సైతం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కానీ ఈ నిర్ణయమే గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. కూటమి నాయకులు పరోక్షంగా మద్దతు ఇస్తారనుకుంటే.. టీడీపీ, జనసేన నాయకులే మొత్తం ఎన్నిక ప్రక్రియను హైజాక్‌ చేసేశారు. తమ పార్టీ అభ్యర్థిలా రంగంలోకి దిగిపోయారు. గ్రామ స్థాయి నాయకుల దగ్గరి నుంచి మంత్రులు వరకు పాకలపాటి రఘువర్మ కోసం నడుంబిగించారు. దీంతో ఎన్నిక ఉపాధ్యాయ సంఘాల మధ్య కాకుండా టీడీపీతో జరిగిన ఎన్నికలా మారిపోయింది. చివరికి పోలింగ్‌ రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా శిబిరాలు ఏర్పాటు చేయడం, వాటిలో ఉపాధ్యాయ సంఘ నాయకుల కంటే టీడీపీ నాయకులే ఎక్కువగా ఉండటంతో చర్చనీయాంశమైంది. ఇదే టీచర్లను ఆలోచించేలా చేసింది.

ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాలివే..

మంచి ఐఆర్‌ ఇస్తానని, రివర్స్‌ పీఆర్‌సీ కాకుండా మంచి పీఆర్‌సీ ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయులు అనుకూలంగా వ్యవహరించారు. కానీ అధికారంలోకి వచ్చాక పీఆర్‌సీ మాట దేవుడెరుగు, ఆ వేతన సవరణ సంఘానికి కనీసం చైర్మన్‌ను నియమించలేదు. ఈ ప్రభుత్వం

న్యూస్‌రీల్‌

సర్కారుకు టీచర్ల బెత్తం దెబ్బ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన గాదె శ్రీనివాసులనాయుడు

స్వయంకృతాపరాధంతో ఓటమిపాలైన పాకలపాటి రఘువర్మ

ఎన్నికల్లో ప్రభావం చూపించిన టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు

ప్రభుత్వం హామీలను విస్మరించడంపై తీవ్ర అసంతృప్తిలో ఉపాధ్యాయులు

స్వరం మార్చిన టీడీపీ..

పాకలపాటి రఘువర్మ ఎన్నికను భుజానికి ఎత్తుకున్న టీడీపీ తాజా ఓటమితో స్వరం మార్చింది. తాము ఇక్కడ పోటీ చేయలేదని.. చెప్పుకుంటూనే ఎదురైన ఓటమిని దూరం పెడుతోంది. గెలిస్తే మా వోడు.. ఓడితే కాని వాడు అని చెప్పుకునే ప్రయత్నంలో పడింది. సాక్షాత్తూ జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికపై స్పందిస్తూ తాము పోటీ చేయలేదని.. పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటును గాదె శ్రీనివాసులు నాయుడుకు రెండో ప్రాధాన్యత ఓటును వేయా లని చెప్పామంటూ మాట మార్చారు. ఒక అభ్యర్థిని గెలిపించమంటూనే మరో అభ్యర్థిని కూడా గెలిపించండని అంతర్గంతగా చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలో వారికే తెలియాలని... ఓటమిని స్వాగతించాలే తప్ప గెలుపు దరి చేరకపోవడంతో మాటమార్చడం సిగ్గుచేటని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
తిరుగుబాటు1
1/3

తిరుగుబాటు

తిరుగుబాటు2
2/3

తిరుగుబాటు

తిరుగుబాటు3
3/3

తిరుగుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement