అందరికీ అందుబాటులో ఉంటా..
కలిసికట్టుగా
పనిచేద్దాం..
పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా పనిచేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. వైఎస్సార్ హయాంలో 9 సీట్లు వచ్చాయని ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆ తరువాత జగన్ కీలకంగా మారారని పోరాటం చేసి వైఎస్సార్‌సీపీని పటిష్టంగా నిలబెట్టారన్నారు. ఓటమిని అంగీకరించే తత్వం చంద్రబాబుకి లేదన్నారు.
● కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
● వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు
● ఓటమిని అంగీకరించడం చంద్రబాబుకి చేతకాదు: ధర్మాన కృష్ణదాస్
● పాలనంటే రెడ్‌బుక్ రాజ్యాంగమా : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్‌సీపీ శ్రేణులందరికీ తాను అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పినా స్పందిస్తానని భరోసానిచ్చారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తనను నోటికి వచ్చినట్టు తిట్టిన వారితోనే చంద్రబాబు జతకట్టి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అప్పట్లో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ పూటకో విషయం మాట్లాడతారని, 9 నెలలు తిరగకముందే ప్రభుత్వంపై జనం ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోవడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థి కాదనడం టీడీపీకి సిగ్గుచేటన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే దమ్మున్న వ్యక్తి జగన్ అని తెలిపారు. పార్టీని స్థాపించిన వారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ గెలవడం ఖాయమన్నారు.
● ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని, కూటమి నేతలకు భయపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర తోనే స్టార్ట్ అయ్యిందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో టీడీపీ నాయకులకు ఉందన్నారు.
● జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి శాంతి, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ నెలకోసారి జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. జగనన్న ఉద్దానం ప్రాంతానికి తాగునీరందించి ఆదుకుంటే ఆ పథకాన్ని కూటమి కొనసాగించలేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు.
● టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ టెక్కలిలో అచ్చెన్నాయుడు మనుషులే అధికారులుగా ఉన్నారని దీంతో అధికార దుర్వినియోగం చాలా ఎక్కువవుతుందన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ సర్పంచులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు రాష్ట్ర అ ధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చింతాడ వరుణ్, అంబటి శ్రీనివాసరావు, ఎంవీ పద్మావతి, గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, ఎంఏ భేగ్, పొన్నాడ రుషి, రౌతు శంకరరావు, పీస గోపి, వైవీ శ్రీధర్, ఎన్ని ధనుంజయరావు, టి.కామేశ్వరి, గుంట జ్యోతి, బొడ్డేపల్లి పద్మజ, శాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పాల వసంతరెడ్డి, మార్పు పృథ్వీ, బూర్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి రీజనల్ కో ఆర్డినేటర్ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్ పెడుతూ జగన్ సమయంలో ఆర్థిక విధ్వంసం చేశారనడం హాస్యస్పదంగా ఉందన్నారు. జగన్ వల్ల దేశంలో అప్పు పుట్టడం లేదంటూనే 2024–25 ఆర్థిక సంవత్సరానికి లక్షానలభై వేల కోట్ల అప్పు ఎలా తెచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడిన విషయాన్ని గమనించాలన్నారు. అమ్మఒడి రెండేళ్లు ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
అందరికీ అందుబాటులో ఉంటా..
అందరికీ అందుబాటులో ఉంటా..
Comments
Please login to add a commentAdd a comment