మహిళా ఉద్యోగులకు చట్టాలపై అవగాహన
శ్రీకాకుళం అర్బన్: ప్రతి మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాటిని సామాన్య ప్రజలకు చేరువ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటికి విధిస్తున్న శిక్షలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ కొత్త చట్టాలను వివరించారు. ఐసీడీఎస్ పీవో బి.శాంతిశ్రీ మాట్లాడుతూ పలు చట్టాలను ఉదహరిస్తు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమాజ సేవకులు హారికా ప్రసాద్, పీఓఐసీ మెట్ట మల్లేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల ప్రాజెక్ట్ అధికారి కవితా, ఐసీడీఎస్ నోడల్ అధికారి మణెమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లక్ష్మి, పీఓఎన్‌ఐసీ లక్ష్మునాయుడు, పలువురు మహిళలు, బాలికలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment