నిర్మాణ పనుల్లో నాణ్యత తప్పనిసరి
● ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి
మెళియాపుట్టి : మల్టీపర్పజ్ సెంటర్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మెళియాపుట్టి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రమానుగూడ, సవర చీడిపాలెం, నందల పాడు గ్రామాల్లో జరుగుతున్న మల్టీపర్పజ్ సెంటర్లను పరిశీలించి స్టీల్, సిమ్మెంట్, ఇటుకల నాణ్యతపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తామన్నారు. భవనాలకు ఉన్న విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పీఓ చెప్పారు. అనంతరం భరణికోట గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, తరగతిగదులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కరజాడ పీహెచ్‌సీని సందర్శించి ఓపీ పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment