ముగిసిన మద్యం షాపుల లాటరీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మద్యం షాపుల లాటరీ

Published Fri, Mar 7 2025 9:18 AM | Last Updated on Fri, Mar 7 2025 9:15 AM

ముగిసిన మద్యం షాపుల లాటరీ

ముగిసిన మద్యం షాపుల లాటరీ

ఆ తప్పులు దొర్లకుండా..

గతంలో 6వ నెంబరు టోకెన్‌ను ముందుగా సక్సెస్‌ అప్లికెంట్‌గా ప్రకటించిన కాసేపటికే 9వ నెంబరు టోకెన్‌ అభ్యర్థిని మళ్లీ ప్రకటించడంతో తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ తప్పు దొర్లకుండా 6వ నెంబర్‌ టోకెన్‌కు కింది భాగాన బాణం గుర్తు పెట్టి డ్రా తీసే ముందు ప్రతీసారి దరఖాస్తుదారులకు చూపించారు. శ్రీకాకుళం ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధి రెండు షాపులకు (మున్సిపల్‌ కార్పొరేషన్‌–31, రూరల్‌– 24) అత్యధికంగా 55 దరఖాస్తులు అందగా ఇచ్ఛాపురం రూరల్‌ పరిధి ఓ షాపునకు అత్యల్పంగా ఇద్దరే దరఖాస్తు వేయడం గమనార్హం. అనంతరం జేసీ మాట్లాడుతూ డ్రా ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెప్పారు. లైసెన్సుదారులకు ప్రొవిజనల్‌ లైసెన్సు ఇచ్చి అనంతరం రెగ్యులర్‌ లైసెన్సును ఎకై ్సజ్‌ విభాగం ద్వారా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి తిరుపతినాయుడు, సీఐ గోపాలకృష్ణ, ఎకై ్సజ్‌ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : కొత్త మద్యం పాలసీ (2024–26)లో భాగంగా గీత, సొండి కులాలకు ప్రభుత్వం కేటాయించిన 18 మద్యం షాపులకు గురువారం లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. గతేడాది అక్టోబరులో జనరల్‌ క్యాటగిరీలో జిల్లాలో 158 మద్యం షాపులకు డ్రా తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లో 4671 దరఖాస్తులు రాగా ఇప్పడు 203 దరఖాస్తులొచ్చాయి. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ విభాగం డిప్యూటీ కమిషనర్‌ దోసకాయల శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ డ్రా టోకెన్లను అభ్యర్థుల సమక్షంలో తీసి చూపించారు.

ఎంపికై న రోజే కట్టేశారు..

గీత కుల ఉప కులాలైన సెగిడి (4), శ్రీశయన (10), యాత(1), గౌడ (1) కులాల వారికి కేటాయించిన 16 దుకాణాలకు, సొండి కులాలవారి రెండు దుకాణాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా వెంటనే రిజిస్టర్‌లో సంతకాన్ని పెట్టి మొదటి వాయిదా సొమ్ము సుమారు రూ. 9 లక్షలు (ఒక్కొక్కరికి) కట్టేసి కుల, ఉపకుల ధృవీకరణపత్రాలను ఇచ్చేశారు. జనరల్‌ క్యాటగిరిలో రూ.65 లక్షలు సంవత్సర ఫీజు ఛలానాల రూపంలో కట్టగా.. వీరు రూ. 35 లక్షలను నాలుగు వాయిదాల్లో ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది.

ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడి..

పేరుకు గీత, సొండి కులాల వారికే షాపులు కేటా యించడం జరిగినా అక్కడ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడే కనిపించింది. సిండికేట్‌గా ఏర్పాటయ్యేందుకు వారి కనుసన్నల్లో ముందుగానే మంత్రాంగం నడిచినట్లు సమాచారం. ప్రభుత్వం జనరల్‌ క్యాటగిరీలో మొదటిచ్చిన తొమ్మిదికి పైగా మార్జిన్‌తో రూ.లక్షల్లో నష్టాలను చవిచూసిన సిండికేట్‌ ఇటీవల 14కి పైగా మార్జిన్‌ పెంచడంతో వీరి కోటాలోనైనా (సగం ధరకే షాపులు దక్కడం) గుత్తాధిపత్యం చేసి సొమ్ములు చేసుకునే యోచనలో ఉన్నట్లు అక్కడక్కడా వినిపించింది.

జేసీ సమక్షంలో గీత, సొండి కులాలకు 18 దుకాణాల కేటాయింపు

హడావిడి చేసిన టీడీపీ నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement