లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు కొట్టేసి..
జి.సిగడాం: మండలంలోని మర్రివలస గ్రామంలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్రివలసకు చెందిన పలిశెట్టి కన్నమ్మ మానంపేట గ్రామానికి నడిచి వెళ్తుండగా అటువైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి లిఫ్ట్ అడిగింది. మానంపేట వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకి నుంచి వచ్చి ముఖంపై కారంజల్లి మెడలో తులన్నర బంగారు పుస్తెలతాడును తెంచుకుని బైక్‌తో పరారయ్యాడు. ఈ ఘటనలో వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
● మానంపేట వద్ద చైన్‌స్నాచింగ్
● వృద్ధురాలికి స్వల్ప గాయాలు
Comments
Please login to add a commentAdd a comment