No Headline
టెక్కలి: ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో పెట్రోల్ విభాగం (సీవీ) విశాఖపట్టణం రఘు ఇంజినీరింగ్ కళాశాల ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. అలాగే ఎలక్ట్రికల్ (ఈవీ) విభాగంలో హైదరాబాద్‌కు చెందిన బీవీఆర్‌ఐటీ కళాశాల విద్యార్థినులు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. ముగింపు సందర్భంగా టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలకు చెందిన సుమారు 16 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అంతకుమునుపు టెక్కలి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ డి.సంజీవరావు, సీఐ ఎ.విజయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం యువత సందడి చేశారు.
No Headline
Comments
Please login to add a commentAdd a comment