రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
ఎచ్చెర్ల మండల పరిధిలోని కేశవరావుపేట గ్రామానికి చెందిన గురుగుబెల్లి దుర్గాప్రశాంతి సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో మెరుస్తోంది. ఈమె తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి వ్యవసాయం చేస్తుంటారు. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా బిడ్డను క్రీడల్లో ప్రోత్సహించారు. ఆమె 7వ తరగతిలో ఉన్నప్పుడు సాఫ్ట్‌బాల్‌లో రంగప్రవేశం చేసి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగింది. చక్కటి క్యాచర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. మొత్తం 9 రాష్ట్రస్థాయి, 5 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. వీటిల్లో మూడు పతకాలు సాధించింది. ప్రస్తుతం విజయవాడలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వం ఉద్యోగం సాధించడంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో సాఫ్ట్‌బాల్ క్రీడ మరింత పురోగాభివృద్ధికి అవసరమైన సాయం చేస్తానని ‘సాక్షి’కి చెబుతోంది. –శ్రీకాకుళం న్యూకాలనీ
బీసీ బాలికల వసతి గృహ మేట్రిన్‌గా పైడి పద్మావతి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 19 ఏళ్ల వయసులో సర్వీసులో చేరిన ఆమె వసతి గృహ మేట్రిన్‌గా 23 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారు. ఎక్కడకు వెళ్లినా అక్కడి పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకోవడం ఆమెకు ఇష్టం. పండగలు, పిల్లల పుట్టిన రోజులు ఇంట్లో కంటే హాస్టల్‌లోనే బాగా జరుగుతాయని పిల్లలే చెబుతుంటారు. పిల్లలకు ఒంట్లో బాగోలేకపోయినా ఆమె సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తారు. పిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తారని, ఇక్కడ తల్లీతండ్రి తానే అయి చూసుకుంటానని చెబుతారు. సమాజంలో మహిళలకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించాలనేదే తన ఆలోచన అని అన్నారు – నరసన్నపేట
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
Comments
Please login to add a commentAdd a comment