యార్లగడ్డ గీతాశ్రీకాంత్.. ఓవైపు పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ, మరోవైపు సామాజిక సేవల్లో ఒదుగుతున్నారు. పాతికేళ్లుగా ఆమె ఎన్నో రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మహిలు ఎదిగేందుకు కృషి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ట్రాక్టర్ల బిజినెస్ చేస్తూ తానూ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు. గిరిజన మహిళల జీవనంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 100 యువ టూరిజం క్లబ్‌లను టూరిజం సహకారంతో ఏర్పాటు చేశారు. జల యోగా ప్రదర్శన ద్వారా 30 రకాల ఆసనాలు నీటిలో వేసి నేషనల్ అవార్డు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment