ఉత్సాహంగా 3కే రన్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో శనివారం జీఎన్‌వీ జ్యూయలర్స్ ఆధ్వర్యంలో 3కే రన్, వాక్ ఉత్సాహభరితంగా సాగింది. జీఎన్‌వీ జ్యూలయర్స్ ఎండీ కిరణ్, పృథ్వీ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 80 అడుగుల రోడ్డులో మహిళలకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి క్రీడాజ్యోతిని వెలిగించారు. 30 ఏళ్లలోపు, 30 నుంచి40 ఏళ్ల మధ్య విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎన్‌వీ ఎండీలు బోయిన నిర్మల, సంయుక్త, ఊన్న సుజాత తదితరులు మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం, అణుకువ ఆభరణాలతో సమానమన్నారు. అనంతరం 3కే వాక్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వందన షాపింగ్ మాల్, క్వాంటమ్ ఈ బైక్స్, హెచ్‌కే ఏజెన్సీ, గ్రాండ్ హోటల్ కార్యక్రమానికి సహకరించినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు పైడి సింధూర, కింజరాపు షర్మిళ, పీఈటీలు సాంబమూర్తి, వెంకటరమణ, జెసీఐ మెయిన్ బెందాళం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, యోగా టీచర్ తంగి స్వాతి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్–30 విభాగంలో పైడి వసంత, ఎస్.శార్వాణి, మేరీ గ్రేస్ తొలి మూడు స్థానాల్లో నిలవగా సీహెచ్ భార్గవి, జి.దివ్య, హెచ్.కల్పన, వి.సంధ్యారాణి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 30 నుంచి 40 ఏళ్ల విభాగంలో వి.నాగమణి, అరుణకుమారి, బి.కృష్ణకుమారి తొలి మూడు స్థానాలు సాధించగా..పి.లక్ష్మీప్రసన్న, ఎం.రోజా, జి.సూర్యకుమారి, కె.అశ్విని ఆ తర్వాత స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు.
ఉత్సాహంగా 3కే రన్
Comments
Please login to add a commentAdd a comment