పొయ్యి వెలిగేనా..?
పొందూరు: స్థానిక ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు ఇక్కడి ఇండేన్ గ్యాస్‌ను సీజ్ చేసి గ్యాస్ సరఫరా బాధ్యతలను తాత్కాలికంగా వేరొక ఏజెన్సీకి అప్పగించారు. మూడు రోజుల కిందట గోడౌన్ తాళాలు రణస్థలం ఏజెన్సీకి అందించారు. కానీ గ్యాస్ సరఫరా ఎలా జరుగుతుందనేది చూడలేదు. పొందూరు, జి.సిగడాం, లావేరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లో పలు పంచాయతీల్లో పొందూరు ఇండేన్ ఏజెన్సీ సేవలు అందుతున్నాయి. ఈ ఏజెన్సీకి తాళాలు పడడంతో సుమారు 60 పంచాయతీల్లో ప్రజలకు గ్యాస్ అందని పరిస్థితి నెలకొంది. ఆయా పంచాయతీల్లో దాదాపు 28వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీకి సుమారు 700 మంది బుక్ చేసుకోగా, ఆదివారం నాటికి సుమారు 2 వేల ఒక వంద మంది వరకు బుక్ చేసుకొన్నారు. గ్యాస్ బుక్ చేసుకోవడం రాని వారు వేల మంది ఉన్నారు. వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లతో పాటు గృహాలు, తోపుడు బళ్ల వారు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఎదురు చూపులే..
వారం రోజులుగా గ్యాస్ కోసం పొందూరు వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లినా కూడా సిలిండర్ దొరకడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా జరిగేట్టు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.
డెలివరీ బాయ్స్ చేసిన తప్పు
గ్యాస్ డెలివరీ బాయ్స్ చేసిన తప్పులకు ఏజెన్సీని రద్దు చేశారు. ఇది సమంజసం కాదు. ఫలితంగా గ్యాస్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీని రద్దు చేయడంపై దృష్టి సారించిన అధికారులు పంపిణీ చేయించడంపైనా శ్రద్ధ చూపాలి.
– పొన్నాడ షణ్ముఖరావు, లబ్ధిదారుడు, పొందూరు
అవస్థలు పడుతున్న పొందూరు,
పరిసర ప్రాంత ప్రజలు
సిలిండర్లు రాకపోవడంతో వంటకు ఇబ్బందులు
తప్పెవరిది..
శిక్ష ఎవరికి?
రాజకీయాలు చేస్తున్నారు..
గ్యాస్ బుక్ చేసి ఆరు రోజులైంది. ఇప్పటికే ఐదు సార్లు గ్యాస్ గోడౌన్‌కు వచ్చాను. గోడౌన్ మూసే ఉంటుంది. ఇంటి దగ్గర గ్యాస్ అయిపోయింది. ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయాలు చేసి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు.
– గురుగుబెల్లి ప్రకాశరావు,
లబ్ధిదారుడు, పిల్లలవలస
పొయ్యి వెలిగేనా..?
పొయ్యి వెలిగేనా..?
పొయ్యి వెలిగేనా..?
పొయ్యి వెలిగేనా..?
Comments
Please login to add a commentAdd a comment