ఇసుక ర్యాంపులో తనిఖీలు
సరుబుజ్జిలి: పురుషోత్తపురం 1, 2 ఇసుక ర్యాంపుల్లో టెక్కలి గనుల శాఖ ఏడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కలెక్టర్ గ్రీవెన్స్‌కు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గం ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ ఇసుక ర్యాంపుపై ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలు మేరకు టెక్కలి గనుల శాఖ అధికారులు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టా రు. ఇసుక ర్యాంపు నిర్వహణ ఎంత విస్తీర్ణం మేరకు నిర్వహించారు, తవ్వకాలు ఎంత లోతులో చేపడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ర్యాంపు తీరం వరకు మైన్స్ అధికారులు బొలేరో వాహనం ద్వారా వెళ్లి తనిఖీ చేశారు. ర్యాంపులో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ర్యాంపులో సీసీ కెమెరాలు ఉండాలని, ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి బ్యానర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. తవ్వకాలు జరిగే ప్రదేశం వద్దకు వెళ్లకుండా అక్కడ ఉన్న కొంతమంది వద్ద నుంచి వివరాలు సేకరించి వెనుదిరిగారు. మైన్స్ అధికారులు ర్యాంపు వద్దకు తనిఖీలు కోసం వచ్చే సమయంలో మండల స్థాయి అధికారులు ఎవ్వరూ లేకపోవడం గమనించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment