పెళ్లి వేడుకకు లైటింగ్ కడుతూ..
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీ ఎర్రన్నపేటకు చెందిన బలగ మణికంఠ(20) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై శుక్రవారం ఉదయం మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికంఠతో పాటు కూన లక్ష్మణరావు, మెట్ట వికాస్‌లు జోనంకి పంచాయతీ అబ్బాయిపేటలో ఓ వివాహ వేడుకకు లైటింగ్ వైర్లు కట్టేందుకు వెళ్లారు. వైర్లు అమర్చుతుండగా అదే రోడ్డులో భారీగా వాహనం రావడంతో వాటిని తప్పించే క్రమంలో 11 కె.వి.లైన్ తాకడంతో వైర్లు పట్టుకున్న మణికంఠ షాక్‌కు గురయ్యాడు. వెంటనే నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికందిన కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మణికంఠకు తల్లిదండ్రులు లచ్చన్న, కుమారి, తమ్ముడు జశ్వంత్ ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
ఎర్రన్నపేటలో విషాదచాయలు
Comments
Please login to add a commentAdd a comment