స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం వైఎస్సార్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం కేటాయించిన ప్యాకేజీ కేవలం అప్పులకే ఖర్చు చేయాలని ప్రకటించడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణ విధానాలను, అక్రమ తొలగింపులు ప్రశ్నిస్తున్న కార్మిక నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమకు అండగా ఉంటారో కార్పొరేట్‌ల పక్షంలో ఉంటారో తేల్చుకోవాలన్నారు. నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్.ప్రకాశరావు, కె.సూరయ్య, కె.కళ్యాణి, డి.సుదర్శనం, హైమ, కె.అప్పారావు, బి.సంతోష్, కె.శ్రీనివాస్, పవిత్ర, హరీష్, ఆర్.రమేష్, పి.దుర్గాప్రసాద్ ఏ.సత్యనారాయణ, రవికుమార్, బి.వాసుదేవరావు, పి.జగ్గారావు, జనార్దణరావు, ప్రవీణ, ఢిల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment