
శ్రీకాకుళం
149 కేంద్రాలు..రేపటి నుంచే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. –8లో
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
పరీక్షలపై ప్రత్యేక నిఘా
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. చూసీ రాతల ఆరోపణల నేపథ్యంలో అధికారు లు అప్రమత్తమయ్యారు. సెల్‌ఫోన్లు పక్కాగా తనిఖీ చేసి లోపలకు విడిచి పెడుతున్నారు. సబ్జెక్టు కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇన్విజిలేట ర్లుగా నియామకం నిలిపివేశారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్రమే డ్యూటీలు వేస్తున్నారు. అధికారులు నిరంతరం పరీక్షలు పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థు లు రాస్తున్న గదులపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్‌ఓ చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546 మంది హాజరు కానున్నారని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళాశాల, శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల, కోర్ కళాశాలలో ఎఫ్‌ఆర్‌ఓ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు.
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పొట్టి శ్రీరాములు కూడలిలో ఆదివారం ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్ర మానికి పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమాను లు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఆసియా ఒలింపియాడ్‌కు దేవాది విద్యార్థి
నరసన్నపేట: ఆసియా స్థాయిలో సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న ఫిజిక్స్ ఒలింపియాడ్‌కు మండలంలోని దేవాది కి చెందిన విద్యార్థి ధర్మాన జ్ఞాన రుత్విక్ ఎంపి కయ్యాడు. మే నెల 4 నుంచి 12వ తేదీ వరకూ ఆసియా స్థాయిలో సౌదీ అరేబియాలో 3వ స్థా యి సెమినార్ జరుగుతుందని, దీంట్లో రుత్విక్ పాల్గొననున్నట్లు తండ్రి ధర్మాన శంకర్‌నారాయణ తెలిపారు. ఇండియా నుంచి ఈ ఒలింపియాడ్‌కు 20 మంది విద్యార్థులు హాజరవుతుండగా ఏపీ నుంచి రుత్విక్ పాల్గొంటున్నాడని తెలిపారు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్‌లో 99.98 శాతం మార్కులు పొంది రుత్విక్ సాయి ప్రతిభ చాటిన విషయం విదితమే.
●జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ● నలుగురు మృతి
●ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ●ఇద్దరికి తీవ్ర గాయాలు
పెద్దలోగిడిలో విషాద ఛాయలు
పాతపట్నం: మండలంలోని పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి కాళిదాసు కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళిదాసు చిన్న కుమారుడు లక్ష్మీపతి వైజాగ్ మధురవాడలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. స్నేహితుడి పెళ్లి కోసం వచ్చిన లక్ష్మీపతి అన్న కుమారుడి పుట్టిన రోజు వేడుకల కోసం కుటుంబాన్ని కారులో విశాఖకు తీసుకెళ్లాడు. అదే అతని ఆఖరి ప్రయాణమైంది. ఈ కారుకు యాక్సిడెంట్ జరిగి లక్ష్మీపతితో పాటు తల్లి మీనమ్మ, బావ భాస్కరరావు చనిపోవడంతో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. లక్ష్మీపతి బావ ఉగ్రపల్లి భాస్కరరావు ఆటోడ్రై వర్‌గా పెద్దలోగిడి గ్రామంలో ఉంటున్నారు.
ప్రమాదంలో దెబ్బతిన్న కారు
ఎచ్చెర్ల క్యాంపస్/ఎచ్చెర్ల/రణస్థలం/పాతపట్నం/ శ్రీకాకుళం క్రైమ్: లావేరు మండలం బుడుమూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సా యంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు ప్రాణాలను గాల్లో కలిపేసింది. టైరు పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ కుటుంబంలో ఆదివారం బర్త్‌డే వేడుకలు జరగాల్సి ఉంది. మరొకరి ఇంటిలో దత్తత వేడుక జరిగింది. కానీ వీరి విధిరాత మరోలా ఉంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివ రాల మేరకు.. పాతపట్నం గ్రామం పెద్దలోడి గ్రామానికి చెందిన దువ్వారి లక్ష్మీపతి(31) విశాఖపట్నంలోని మధురవాడలో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరై శనివారం తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం తన అన్న కుమారుడి బర్త్ డే ఉండడంతో తన కారులోనే తల్లి మీనమ్మ (56), బావ ఉగ్రపల్లి భాస్కరరావు (45), మేన కోడలు కుసుమ, తండ్రి కాళిదాసుతో కలిసి బయల్దేరారు.
కారులో విశాఖ వెళ్తుండగా లావేరు మండలం బుడుమూరు సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పంక్చర్ అయ్యి బండి అదుపు తప్పింది. సరిగ్గా అదే సమయానికి తోలాపి శంకరరావు(41) రోడ్డు పక్కన తన స్కూటీని ఆపి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదుపు తప్పిన కారు అమాంతం శంకరరావును ఢీకొట్టి రోడ్డు పక్కనే ఆపిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టి లేఅవుట్‌లోకి దూసుకుపోయి ంది. ఘటనలో శంకరరావు తీవ్రంగా గాయపడి అక్కడే ఊపిరి వదిలేశాడు. కారులో ఉన్న మీనమ్మ, భాస్కరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందా రు. లక్ష్మీపతి, కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ లో వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. అయితే లక్ష్మీపతి ఆస్పత్రిలో చేరుస్తుండగానే కన్ను మూశా రు. క్షతగాత్రులు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. లావేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొన్న లారీ కోసం పోలీసులు దృష్టి సారించారు.
ఒంటరైపోయింది..
ఘటనలో చనిపోయిన శంకరరావు స్వగ్రామం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మద్దూరిశంకరపేట. ఈయన రణస్థలంలోని యూబీ బేవరేజెస్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రణస్థ లంలోనే ఉంటున్నారు. ఏడాది కిందటే శంకరరావు కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అనంత రం ఆయన ఓ బాలికను దత్తత చేసుకున్నట్లు సమా చారం. ఆ బాలిక జనన ధ్రువీకరణ పత్రం కోసం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి, చేపలు పట్టుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో భార్య జీవన కుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె శ్రీకాకుళం రిమ్స్‌కు వచ్చారు. ఏడాది కిందటే కుమారుడిని కోల్పోయి తీరని శోకంలో ఉన్న ఆమెకు ఇప్పుడు భర్త కూడా దూరం కావడంతో గుండెలవిసేలా రోదించారు.
రిమ్స్ ఆస్పత్రిలో లక్ష్మీపతి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
ప్రమాద స్థలంలో శంకరరావు మృతదేహం
●రోడ్డు పక్కనే స్కూటీ ఆపి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి స్కూటీ ముక్కలైంది. వాహనంపై ఉన్న వ్యక్తి స్పాట్‌లోనే మరణించారు.
●కారు కుడిభాగం నుజ్జు కావడంతో.. ఎయిర్ బెలూన్ లు ఓపెన్ అయినా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా
చనిపోయారు.
సంఘటనా స్థలాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది.
ప్రమాద స్థలం: బుడుమూరు జాతీయ రహదారి
ప్రమాదానికి కారణం:
కారు టైర్ పేలడం!
ప్రమాదం జరిగిన సమయం: సాయంత్రం 5.40
యాక్సిడెంట్
స్పాట్
వాచ్
●అయినా కారు వేగం
కంట్రోల్ కాలేదు. అంతే వేగంతో అక్కడే ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని డ్రైవర్ వైపు భాగం నుంచి బలంగా ఢీకొట్టింది.
●వెనుక వైపు కూర్చున్న వ్యక్తి ఒక్క ఉదుటన పక్కనున్న మహిళను ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా
స్థలంలోనే చనిపోయారు.
●వెనుక భాగంలో ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కరు సీట్ బెల్ట్ ధరించినా రెండు ప్రాణాలు నిలిచేవి.
●వాహనం ముందు భాగంలోని ఎడమ వైపున్న టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పింది.
న్యూస్‌రీల్
ప్రమాదాల బుడుమూరు

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం

శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment