
ఇంటర్ స్పాట్
నేటి నుంచే
●
సీసీ కెమెరాల పర్యవేక్షణలో..
జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. సిబ్బంది నియామ కం పూర్తయింది. స్పెల్స్‌ను బట్టి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. సమయపాలన పాటించాలి. సెల్‌ఫోన్‌లకు అనుమతిలేదు. సీసీకెమెరాలను అమ ర్చి, స్ట్రీమింగ్ చేయిస్తున్నాం. బోర్డు ఉన్నతాధికారు లు కూడా పర్యవేక్షిస్తారు. – ప్రగడ దుర్గారావు,
ఆర్‌ఐఓ/ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్)కు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ (బాలుర) జూనియర్ కళాశాల కేంద్రంగా సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఈ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగు విడతల్లో జరిగే స్పాట్‌లో మొదటి విడతగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సివిక్స్ పేపర్లను దిద్దనున్నారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ మొదలైంది. గత ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం కింద శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించింది. సరికొత్త ఫర్నిచర్, ఫ్యాన్లు, లైటింగ్, మరుగుదొడ్లు ఇలా అన్ని వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో అధికారులు సైతం ప్రశాంతంగా ఉన్నారు. కాగా స్పాట్‌కు హాజరయ్యేవారు సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని, దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చి, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేశారు.
జిల్లాకు చేరిన పేపర్లు..
శ్రీకాకుళం జిల్లాకు 2.45 లక్షల జవాబుపత్రాలు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 2లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13 ప్రధాన సబ్జెక్టుల జవాబుపత్రాలు ఉన్నాయి. ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. పేపర్(స్క్రిప్ట్)కు రూ.23.66 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు రూ. 709.66లు చెల్లించనున్నారు. వీటితోపాటు టీఏ, డీఏ, లోకల్ కన్వీయిన్స్/అవుట్‌స్టేషన్ అలవెన్స్ ఇలా చెల్లించే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
నియామకాలు పూర్తి..
స్పాట్ వాల్యుయేషన్‌లో అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం 1200 మం యంత్రాంగం/సిబ్బందిని నియమించారు. క్యాంప్ ఆఫీసర్‌గా ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు వ్యవహరిస్తున్నారు. ఏసీవో జనరల్–1 గణపతి వెంకటేశ్వరరావు (ఇన్‌చార్జి ప్రిన్సిపాల్– జీజేసీ శ్రీకాకుళం బాలురు), జనరల్–2గా (ఫిజిక్స్ జేఎల్– శ్రీకాకుళం బాలురు)తోపాటు సీసీవోలు, కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు నియామక ప్రక్రియ పూర్తయ్యింది. స్పాట్ ఆర్డర్ నియామక ఉత్తర్వులు ఆయా కాలేజీల బీఐఈఏపీ లాగిన్‌లో డౌన్‌లోడింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా మూల్యాంకనం
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
స్పెల్ మొదలయ్యే తేది దిద్దనున్న సబ్జెక్టులు
1వ స్పెల్ మార్చి 17నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, సివిక్స్
2వ స్పెల్ మార్చి 22 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్, జీఎఫ్‌సి
3వ స్పెల్ మార్చి 24 నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ
4వ స్పెల్ మార్చి 26 నుంచి కామర్స్, బోటనీ, జువాలజీ, బ్రిడ్జ్ కోర్సులు

ఇంటర్ స్పాట్

ఇంటర్ స్పాట్
Comments
Please login to add a commentAdd a comment