20 కిలోల గంజాయి స్వాధీనం
పాతపట్నం: గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్సీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. ఆదివారం పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన సాగిపల్లి పవన్ అలియాస్ రోషన్ పాతపట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ పెయింటింగ్ మేస్త్రిగా పనులు చేసేవాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా జాజిపూర్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ పాణిగ్రహి అలియాస్ సీతారాం వద్దకు వెళ్లి గంజాయి కొనేవాడు. 20.540 కిలోల గంజాయిని రూ.60 వేలు కొనేందుకు ఒప్పందం కుదిర్చుకొని, ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అశోక్‌కుమార్ ఒడిశా నుంచి పాతపట్నం మేజర్ పంచాయ తీ కాపుగోపాలపురం వైపు నడుచుకుంటూ వస్తు.. సాగిపల్లి పవన్‌కు అందజేసే క్రమంలో పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పవన్‌పై గతంలో ఆమదాలవలస, ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో కేసులు ఉన్నాయని, అశోక్‌కుమార్‌పై ఇచ్ఛాపురం పోలీసు స్టేషన్‌లో కేసు ఉందని డీఎస్పీ వివరించారు. విలేకరుల సమావేశంలో పాతపట్నం సీఐ వి.రామారావు, ఎస్‌ఐ బి.లావణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment