కుంటిభద్రలో ఏనుగుల తిష్ట
శ్రీకూర్మం పరిధిలో పులి కలకలం
కొత్తూరు: మండలంలోని కుంటిభద్ర గ్రామంలో సోమవారం ఏనుగుల గుంపు తిష్ట వేసింది. రాత్రి వంశధారలో నీటిని తాగుతూ పగలంతా అరటి, చెరుకు, మొక్కజొన్న పంటల్లో తిష్ట వేస్తున్నాయి. ఏనుగులను కవ్వించవద్దని తహసీల్దార్ రవిచంద్ర సూచించారు.
గార: శ్రీకూర్మం, అంపోలు పంచాయతీల పరిధిలో పులి సంచరిస్తోందని పుకార్లు వెల్లువెత్తాయి. ఆది వారం ఉదయం శాలిహుండం పంచాయతీ పరిధి తంగుళ్లపేటలో చూశామని రైతులు తెలిపారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది శాలిహుండం, సతివాడ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో పొలాలు, నీటి కాలువల వెంబడి పాదముద్రలు పరిశీలించారు. సోమవారం ఉదయం నుంచి శ్రీకూర్మం పంచాయతీ చల్లపేట, అంపోలు పంచాయతీ జెల్లపేట పరిధిలో పులి ఉందని పుకార్లు షికార్లు చేశాయి.
కుంటిభద్రలో ఏనుగుల తిష్ట