విద్యుత్ మీటర్ రీడర్లను ఆదుకోవాలి
కాశీబుగ్గ: విద్యుత్ శాఖలో తీసుకొస్తున్న మార్పుల వల్ల సుమారు ఐదు వేల మీటర్ రీడర్ కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ పలాస డివిజన్ నాయకులు చాపర వేణుగోపాల్, జిల్లా మీటర్ రీడర్స్ అధ్యక్షుడు ఆర్.కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం మీటర్ల రీడర్లతో కలిసి పలాస విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా కేటీరోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 20 ఏళ్లు విద్యుత్ బిల్లులు తీస్తున్న సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ఐఆర్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్ల బిగిస్తున్న నేపథ్యంలో జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం పలాస విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మీటర్ రీడర్ల సంఘ జిల్లా కార్యదర్శి దూగాన భాస్కరరావు, పలాస డివిజన్ అధ్యక్షుడు బి.ఓంకార్, పలాస డివిజన్ కార్యదర్శి కె.నరేష్, సోంపేట, పలాస సబ్ డివిజన్ మీటర్ రీడర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment