ఏప్రిల్ 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఏప్రిల్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్‌చార్జి ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు మంగళవారం తెలిపారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 7221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: అనుమతులకు వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహంపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన జూమ్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విండోకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని జీఎంను అడిగారు. 15 దరఖాస్తులు రాగా 13 ప్రాసెస్‌లో ఉన్నట్లు జీఎం విజయరత్నం చెప్పారు. ిపీఎంఈజీపీలో 69 లక్ష్యం కాగా 90 మంజూరు చేశామని ఇందుకు రూ.4.39 కోట్లు మంజూరు చేసినట్లు జీఎం తెలిపారు.
ఏప్రిల్ 13 న జిల్లాస్థాయి మేధా సమ్మాన్ పరీక్ష
కవిటి: జిల్లాలోని అన్ని ఒడియా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్(అపోటా) ఆధ్వర్యంలో మేధా సమ్మాన్ ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్టు అపోటా ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయి తెలిపారు. మంగళవారం సహలాలపుట్టుగ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన వివరాల్ని వెల్లడించారు. ఈ నెల 25 లోగా ఏ పాఠశాల నుంచి ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారన్న సమాచారాన్ని ఆయా మండలాల అపోటా అధ్యక్ష,కార్యదర్శులకు నివేదించాలన్నారు. ఐదో తరగతి చదువుతున్న వారు ప్రతి పాఠశాల నుంచి 5 మందికి మించకుండా బాలబాలికలు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
కవిటి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిపై కవిటి పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు మంగళవారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై ఈ వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్లు తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా విచారణ చేశారు. ఈ వ్యక్తి ఈ నెల 11న బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. మళ్లీ 14వ తేదీన కూడా అలాగే ప్రవర్తించినట్లు గ్రామంలో జరిపిన విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణను కాశీబుగ్గ రేంజి డీఎస్పీ కె.వెంకట అప్పారావు పర్యవేక్షణలో చేపడుతున్నామని చిన్నంనాయుడు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామన్నారు.
రిమ్స్‌లో అత్యవసర సమాచార సేకరణకు ఫోన్ నంబర్
శ్రీకాకుళం: శ్రీకాకుళం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, ప్రసూతి విభాగంలో అత్యవసర సమాచార సేకరణ కోసం ఓ నూతన కార్యక్రమాన్ని ప్రారభించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ అన్నారు. రిమ్స్‌లో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.పార్వతి ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం చేతుల మీదుగా మంగళవారం మొబైల్ నంబర్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పార్వతి మాట్లాడుతూ.. ప్రసూతి విభాగంలో అత్యవసర సేవలకు ఈ ఫోన్ నంబర్ వాడుకోవచ్చన్నారు. ఫోన్ నంబర్‌ను డీఎంహెచ్‌ఓ కార్యాలయం ద్వారా అన్ని పీహెచ్‌సీలకు అందిస్తామని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కల్యా ణ్ బాబు తెలిపారు.
ఏప్రిల్ 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment