ఉగాది కవితా పురస్కారాల విజేతలు వీరే
శ్రీకాకుళం కల్చరల్ : వేమన కవితా నిలయం (శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో విశ్వావసు నామ ఉగాది (2025) పురస్కార కవితా సంపుటాల విజేతలను నిర్వాహకులు మహ్మద్ రఫీ (ఈవేమన), నిమ్మగడ్డ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 23న కేంద్ర గ్రంథాలయ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో పద్మావతి రాంభక్త (మెతుకు వెలుగులు), యాములపల్లి నరసిరెడ్డి (శిలావృక్షం), వైరాగ్యం ప్రభాకర్ (ఆకాశమంత), బగాది వెంకటరావు (బగాది బాసలు), వైతాళీయ కుచేలోపాఖ్యానం (మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ), కడలి కవితా ప్రసూనాలు (కడలి ప్రకాశరావు) విజేతలుగా నిలిచారని ప్రకటించారు.
స్టేడియానికి వైఎస్సార్ పేరు
తొలగింపు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): విశాఖపట్నం మధురవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం బోర్డులో వైఎస్సార్ పేరును తొలగించడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఒక పేజీని ఇలా పేర్లు మార్పుకే కేటాయించడం దారుణమన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఓ జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని గుర్తు చేశారు. ఇటువంటి నిస్వార్థ రాజకీయాలు చేసేది ఒక్క వైఎస్సార్ కుటుంబమేనని స్పష్టం చేశారు. కుల్లు, కుతంత్రా లు, మోసాలతో రాజకీయం చేసేది చంద్రబాబు, లోకేష్‌లని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టేడియం పేరు మార్చలేదని, ఇప్పుడే ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment