గేట్ ర్యాంకులపై హర్షం
ఎచ్చెర్ల క్యాంపస్: ఇంజినీరింగ్ పూర్తి చేసి జాతీయ విద్యా సంస్థల్లో పీజీ (ఎంటెక్) చదివేందుకు ఉద్దేశించిన అర్హత పరీక్ష ‘గేట్’లో శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) విద్యార్థులు ర్యాంకులు సాధించటం పట్ల క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకటగో పాల ధన బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. అధికారు లు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి గురువారం కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. కొమరాల శేతశ్రీ ఈసీఈ విభాగంలో 241వ ర్యాంకు, అప్పాన శ్రీనివాస్ సీఎస్‌ఈలో 663వ ర్యాంకు సాధించారు. సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్‌ఈలలో 60 మంది వరకు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జాతీయ విద్యా సంస్థల్లో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ వంటి ప్రభుత్వ సంస్థ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పరిపాలన అధికా రి ముని రామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి, ఎఫ్‌వో వాసు, డీన్ ఆఫ్ వెల్పేర్ గేదెల రవి, సీఎస్‌ఈ హెచ్‌వోడీ రమేష్‌కుమార్, పీఆర్వో మామిడి షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.
అదరగొట్టిన నివాస్
శ్రీకాకుళం న్యూకాలనీ: గేట్ ఫలితాల్లో శ్రీకాకుళం నగరంలోని వాంబేకాలనీకి చెందిన అడ్డూరి నివాస్ ప్రతిభ కనబర్చాడు. ఆలిండియా స్థాయిలో 204వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. తండ్రి వెంకట్ మృతిచెందడటంతో తల్లి అనూరాధ టైలరింగ్ చేస్తూనే పిల్లలను చదివిపిస్తుంది. సోదరి ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. నివాస్ ప్రతిభ కనబరచడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.
గేట్ ర్యాంకులపై హర్షం
గేట్ ర్యాంకులపై హర్షం
గేట్ ర్యాంకులపై హర్షం
Comments
Please login to add a commentAdd a comment