విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
అరసవల్లి: విద్యుత్ మీటర్ల రీడింగ్ బాధ్యతలను నుంచి క్రమక్రమంగా తప్పించేలా యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు దారుణమని, ఈ చర్యలతో వేలాది మంది మీటర్ రీడర్లు రోడ్డున పడనున్నారని బాధిత సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేళ్లుగా నాట్ స్కాన్ మీటర్లు ఉన్నప్పటికీ, వాటిని మార్చకుండా వెరిఫై చేయకుండానే..మేమే స్కాన్ చేయడం లేదన్న సాకుతో భారీగా జీతాల్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన మొబైల్స్ కూడా రీడర్లుకు ఇవ్వకుండా ప్రణాళికబద్ధంగా వేటు వేసేలా కుట్రలు చేస్తున్నార ని ఆరోపించారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను ఇవ్వాలని తామంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నామని.. తక్షణమే యాజమాన్యం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఎస్.అఖిల్, జి.తేజ, ఎల్.భాస్కర్, ఆర్.రమేష్, ఎన్.గోవిందరావు, పి.సంతోష్, బి. దేవీవరప్రసాద్ తదితరులున్నారు. అనంతరం విద్యుత్ శాఖ సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులకు వినతిపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment