కూటమి నేతలు కక్షగట్టారు
● అధికారులకు ఫిర్యాదు చేసిన అల్లాడపేట సర్పంచ్ చిన్నమ్మడు
జలుమూరు: కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాని కి చెందిన టీడీపీ నాయకులు అలజడులు, వివాదా లు సృష్టిస్తున్నారని జలుమూరు మండలం అల్లాడ పేట సర్పంచ్ కల్యాణం చిన్నమ్మడు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లాడపేట ఫీల్డ్ అసిస్టెంట్ పంగ వెంకటరమణపై గ్రామానికి చెంది న మెండ శిమ్మయ్య, ఎం.రాంబాబు, కల్యాణం జనార్దనరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టేందుకు గురువారం నరసన్నపేట క్లస్టర్ ఏపీడీ పూడి లోకేశ్ గ్రామానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయంలో వేతనదారులతో మాట్లాడారు. గ్రామంలో లేనివారికి ఉపాధి హాజరు వేస్తున్నారని, తమకు పనులు కల్పించడం లేదని ఓ వర్గం చెప్పగా.. అందరికి పనులు కల్పిస్తున్నారని గ్రామానికి చెందిన మెండ అప్పారావు, నేతింటి చిన్నమ్మడు, మెండ ఆరుద్ర, మెండ రామచంద్రరా వు, కల్యాణం సూర్యారావు తదితరులు వివరించా రు. ఈ నేపథ్యంలో సర్పంచ్ చిన్నమ్మడు అధికారి తో మాట్లాడుతూ తన భర్త కల్యాణం అచ్చెన్నను హత్య చేసిన వారే మళ్లీ ఇలాంటి తప్పుడు ఫిర్యాదు లు చేస్తున్నారని చెప్పారు. వీరిపై పలు కేసులు కూడా నడుస్తున్నాయని తెలిపారు. వంట ఏజెన్సీ, అంగన్‌వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా అందరినీ బెది రిస్తున్నారని అధికారి దృష్టికి తీసుకొచ్చారు. నిత్యం గొడవలు సృష్టిస్తున్న వీరిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యా దు చేశామన్నారు. గ్రామంలో వైఎస్సార్‌సీపీ సాను భూతిపరులపై కుట్ర పన్నుతున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. కా ర్యక్రమంలో ఏపీఓ శేఖర్, వైఎస్సార్‌సీపీ నాయుకు లు కల్యాణం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment