పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ‘పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి, పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది‘ అని కలెక్టర్ హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ పై సమీక్షించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్‌పై ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కష్ణమూర్తికి సూచించారు. సమీక్షకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీఓ ప్రసన్న లక్ష్మి, టెక్కలి ఆర్డీవో కృష్ణ మూర్తి, ఐసీడీఎస్ పీడీ బి.శాంతి శ్రీ, డ్వామా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ నగేష్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment