ఆందోళన వద్దు.. అండగా ఉంటా..
పొందూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అనునిత్యం అండగా ఉంటానని ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ అన్నారు. రాజకీయ కక్షలతో మండలంలోని ఖాజీపేట గ్రామంలో జరిగిన కొట్లాటలో 42 రోజులుపాటు రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై వచ్చిన బాధితులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు చింతాడ వెంకట సత్యప్రసాద్, తమ్మినేని మురళి, బొమ్మాళి గిరి, పైడి నాగభూషణం, సూర ఆనందరావు, పైడి లోకనాథం, సింగూరు తేజేశ్వరరావు, కూటికుప్పల రాజు, కిల్లి సన్యాసిరావు, గురుగుబెల్లి శేఖర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment