ప్రిస్క్రిప్షన్ లేకుండా..విజిలెన్స్ అధికారులు మెడికల్
‘నన్ను చూడగలవా..?’ అంటూ ఓ బంకులో రీడింగ్ బోర్డు సవాల్ విసురుతూ ఉంటుంది. ‘అంకెలు లెక్క పెట్టగలవా..?’ అని మరో బంకులో రీడింగ్ చూపులకు అందనంత స్పీడులో పరుగులు పెడుతూ ఉంటుంది. ‘ఏం పోశావురా.. బాబూ’ అంటూ ఇంకో బంకులో ఆయిల్ పోసిన వెంటనే సైలెన్సర్ సాయంతో బండి ఏడుస్తూ ఉంటుంది. మోసపోవడం సామాన్యుడి జన్మహక్కు అన్నట్లు బంకుల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. రీడింగు నుంచి పెట్రోల్ నాణ్యత వరకు ఏదో ఒక దశలో మోసాలకు పాల్పడుతున్నాయి. వీరి వైఖరి వల్ల నిజాయితీగా ఉండే బంకులకు కూడా చెడ్డపేరు వస్తోంది. ‘సాక్షి’ శుక్రవారం నిర్వహించిన పరిశీలనలో పలు విషయాలు వెలుగు చూశాయి.
●
Comments
Please login to add a commentAdd a comment