ఇంధనం.. మోసాలే ఘనం..
● పెట్రోల్ బంకుల్లో చాలా విధాలుగా మోసాలు జరుగుతున్నాయి. కొన్ని బంకుల్లో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా.. చాలా బంకుల్లో మాత్రం బహిరంగంగానే మోసాలకు పాల్పడుతున్నారు.
● బంకుల్లో పంప్ నుంచి పెట్రోల్ విడుదల చేసే మిషన్ డిజిట్‌ను ఎక్కువగా వాడుతున్నారు. మీటరుపై చూపించే సరికే ఈ ఆయిల్ విడుదల జరుగుతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు.
● ఈ డిజిటల్ మీటర్ ఫీడింగ్ ప్రైవేటు టెక్నీషియన్లతో చేయించుకుంటారు. పెట్రోల్ పంపింగ్ వేగం ఆధారంగా చేసే ఈ ప్రక్రియలో లోపాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
● దీనికి తోడు పంపింగ్ జరిగినప్పుడు ఆ పంపు ఆపరేటర్లు చేతివాటం ఉంటుంది.
● పెట్రోల్ కల్తీ కూడా చాలా చోట్ల జరుగుతోంది. ట్యాంకులో పెట్రోల్‌ను ఫిల్లింగ్ చేసేటప్పుడు పెట్రోల్‌తో పాటు ఇథనాల్ కూడా వెళ్తుంది. దీంతో పెట్రోల్‌తో పాటు ఇథనాల్ కూడా పంపింగ్ జరిగి వాహనాలు పాడవటం, ఇంధనం తక్కువగా రావడం వంటివి జరగుతున్నాయి. ఎక్కువగా వర్షాకాలం శీతాకాలంలో ఈ సమస్యలు ఉంటాయి.
● ఇక బంకుల్లో ముందుగా చెల్లించిన డబ్బుకి ఫీడ్ చేసి ఆయిల్ కొడతారు. ఇక్కడ కూడా సాంకేతిక సాకుతో తప్పిదాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment