రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
సారవకోట: మండలంలోని బుడితి గ్రామానికి చెందిన చిత్తిరి ఆర్య (21) శుక్రవారం రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్య వ్యక్తిగత పనిపై శుక్రవారం చీపురుపల్లిలో రైలు ఎక్కి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ వెళ్లాడు. అక్కడి నుంచి జాజ్‌పూర్ వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి దగ్గరున్న ఆధార్ కార్డు, ఫోన్ సహాయంతో అక్కడి రైల్వే పోలీసులు విజయవాడలో ఉంటున్న తల్లిదండ్రులు బుజ్జి, మహాలక్ష్మిలకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బుడితికి చెందిన కొందరితో కలిసి భువనేశ్వర్ బయల్దేరారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment