వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు
ఇచ్ఛాపురం రూరల్: ‘ఏరా.... ఏ ఊరు నీది...?. మీ నాన్న ఎవ డ్రా...?!’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వెటకారంగా మాట్లాడి యువకుడ్ని ఒంటర్ని చేసి ముకుమ్మడిగా పిడుగుద్దులు గుద్ది పైశాచికానందం పొందారు టీడీపీ సానుభూతిపరులు. వివరాలలోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం మశాఖపురం గ్రామంలో కొత్తపల్లి దేవరాజుది ఒకే ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబం. దేవరాజు కుమారుడు భీమారావు వైఎస్సార్‌సీపీలో చురుగ్గా ఉంటా డు. భీమారావు అదే గ్రామంలో ఆదివారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. అదే గ్రామానికి చెందిన పైల బైరాగి, రంగు కామేష్ అనే టీడీపీ సానుభూతిపరులు భీమారావును పిలిచి ‘మీది ఈ ఊరు కాదు కదా.. మరి ఏ ఊరు, మీ నాన్న ఎవడ్రా...?’ అంటూ వెటకారంగా మా ట్లాడటంతో భీమారావు ప్రతిఘటించాడు. దీంతో పైల భైరాగి, రంగు కామేష్‌లతో పాటు ఉప సర్పంచ్ ఆశి మాధవరావు, ఆశి లక్ష్మీనారాయణ, రోకళ్ల కుమార్‌లు భీమారావును చుట్టిముట్టి పిడుగుద్దులతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న మహిళలు అడ్డుకున్నారు. భీమారావు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో తనకు ప్రాణహాని ఉందంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ ఎం.చిన్నంనాయుడు మాట్లాడుతూ ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలను విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఎచ్చెర్ల క్యాంపస్: వైఎస్సార్ సీపీ కార్యకర్త, పూర్వపు వలంటీర్ కూన కిరణ్‌కుమార్‌పై టీడీపీ వర్గానికి చెందిన వారు ఆదివారం దాడికి పాల్పడ్డారు. కిరణ్‌కుమార్ బైక్‌పై ఫరీదుపేట వస్తుండగా ముగ్గురు వ్యక్తులు దారి కాచి కర్రలు, రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి విషయాన్ని ఎచ్చె ర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా గ్రామానికి డీఎస్పీ వివేకనంద, ఎస్‌ఐ సందీప్‌కుమార్ చేరుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఇప్పటికే కొనసాగుతోంది. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు