వానర సైన్యం!
వామ్మో..
టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.
బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు
గుంపులుగా తిరుగుతున్న కోతులు
మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం
వానర సైన్యం!
వానర సైన్యం!
వానర సైన్యం!
Comments
Please login to add a commentAdd a comment