దూసుకొచ్చిన మృత్యువు
ఎచ్చెర్ల క్యాంపస్: విధి నిర్వహణకు బయలుదేరిన ఓ ఉద్యోగిని మృత్యువు వెంటాడింది. ఇంటి నుంచి బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడనే విషయం తెలిసి అతని భార్య విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలోని రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశరాజు వెంకట కిరణ్‌కుమార్ (40) అనే వ్యక్తి రణస్థలం సమీపంలోని కొండములగాం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్ల క్రితం ప్లాట్ కొనుక్కుని కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇక్కడి నుంచే ఆస్పత్రికి స్కూటీపై రాకపోకలు సాగిస్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం కూడా ఆస్పత్రి విధులకు హాజరయ్యేందుకు స్కూటర్‌పై బయలుదేరాడు. పాత జాతీయ రహదారిపై కేశవరెడ్డి ప్రైవేట్ పాఠశాల సమీపంలో సర్వీస్ రోడ్డు నుంచి రణస్థలం వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుండగా రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న మ్యాక్సీ క్యాబ్ వాహనం ఢీకొట్టింది. దీంతో స్కూటీ కొన్ని మీటర్లు ముందుకెళ్లి ఎగిరిపడింది. ఈ ఘటనలో కిరణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి స్క్రాప్ షాపులోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కిరణ్‌కుమార్ గతంలో ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశారు. అనంతరం రణస్థలం బదిలీ అయ్యారు. ఇతనికి భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు జ్యోతితాశ్రీ, నితీషాశ్రీ ఉన్నారు. స్వస్థలం శ్రీకాకుళమైనా ఇక్కడే సొంతంగా ప్లాట్ కొనుక్కొని పిల్లలను చదివిస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకొని పొలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మ్యాక్సీక్యాబ్ ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్
మృతి
విషాదంలో కుటుంబ సభ్యులు
దూసుకొచ్చిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment