యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రటించిన ఉచిత ఇసుక విధానం కొంతమందికి కాసులు కురిపిస్తోంది. పగటి పూట అధికారులు దాడులు చేస్తారని భావించి రాత్రివేళల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు దర్జాగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు మండలాల నుంచి ఇసుకను పాతపట్నం మీదుగా ఆల్ ఆంధ్రా రహదారిలో మెళియాపుట్టి గ్రామ వీధుల్లో నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు రూ.2000 చొప్పున అపరాధ రుసుం విధించారు.
తర్వాత వారిని వదిలేయడంతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ సాయంత్రమైతే పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ఒడిశాకు రాత్రివేళల్లో
తరలించుకుపోతున్న వైనం
ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
అడ్డుకుంటాం..
గతంలో ఇదేవిధంగా చేస్తే ఒడిశా బోర్డర్ వద్ద మా సిబ్బందితో కలిసి పరిశీలన చేయించాం. ఇసుక తరలిస్తున్న వారిని వీఆర్వోలు అడ్డుకున్నా ఆపకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు రాత్రివేళల్లో, సెలవురోజుల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సాయంతో అడ్డుకుంటాం..
– పాపారావు, మెళియాపుట్టి తహశీల్దార్
కట్టడి చేస్తాం..
ఇదివరకే మహేంద్రతనయ నదీ తీరంలో నిఘా పెట్టాం. మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మావంతు చర్యలు తీసుకుంటున్నాం.
– రమేష్ బాబు, మెళియాపుట్టి ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment