
జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా సురేష్‌కుమార్ నియ
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి(డీఐఈఓ)గా ఆర్.సురేష్‌కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. విజయనగరం జిల్లా గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయనను తాత్కాలిక డీఐఈఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ శ్రీకాకు ళం జిల్లా డీవీఈఓగా పనిచేసిన శివ్వాల తవిటినాయుడును విజయనగరం జిల్లా డీఐఈఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. తవిటినాయుడు పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ జిల్లా డీవీఈఓగా సేవలందించిన విషయం తెలిసిందే.
ఉపాధిలో ఖాళీలకు
కొత్త అభ్యర్థులకే అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఖాళీగా ఉన్న క్షేత్ర సహాయకులు, సీనియర్ మేట్ల పోస్టులు భర్తీ చేయనున్నట్టు డ్వామా పీడీ సుధాకర్ రావు తెలిపారు. ఖాళీల భర్తీకి కొత్త అభ్యర్థుల వివరాలను మాత్రమే పంపాలని మండల అభివృద్ధి అధికారులకు తెలిపారు. మేట్ల మధ్య తగాదాలు, పని వేళల్లో గైర్హాజరీ వంటి సమస్యలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పరిష్కరించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో
ఎంఈఓ పిల్లలు
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో స్థానిక ఎంఈఓ ఎన్.శ్రీనివాసరావు కుమార్తెను ఆరో తరగతిలో చేర్చారు. ప్రవేశ పత్రంను హెచ్‌ఎం గోవిందరావు అందజేసి జాయిన్ చేసుకున్నారు. ఇప్పటికే ఎంఈఓ కుమారుడిని సైతం ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. ప్రభు త్వ బడుల్లో నైతిక విలువలతో పాటు నాణ్యమైన విద్య అందుతోందని, అందుకే పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించానని ఎంఈఓ శ్రీనివాసరావు తెలిపారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని హెచ్‌ఎంతో పాటు సిబ్బంది ప్రచారం చేశారు.
ఇసుక మేటల తొలగింపు
ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్: నారాయణపురం ప్రాజెక్టు పరిధిలో ఇసుక మేటలు తొలగించే పనులు సోమవారం ప్రారంభించారు. నారాయణపురం కుడి కాలువ ద్వారా ఎచ్చెర్ల మండలంలో 13 పంచాయతీల పరిధిలో 7175 ఎకరాకు సాగునీరు అందుతుంది. గత ఏడాది సాగునీటి సమస్య కాణంగా పంటలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకువెళ్లారు. దీంతో ఖరీఫ్ సాగునీటి లక్ష్యంగా యంత్రాలతో పనులు ప్రారంభించారు.
పశువుల అక్రమ రవాణా
అడ్డగింత
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువులను లావేరు హెచ్‌సీ రామారావు సోమవారం పట్టుకున్నారు. బుడుమూరు సంత నుంచి రణస్థలం వైపు వెళ్తున్న బొలెరో వ్యానులో ఈ పశువులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాన్‌లో తొమ్మిది ఆవులు, మరో వ్యానులో ఏడు ఆవులు ఉన్నట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, గుజ్జంగివలసకు చెందిన దేవ రమేష్, ఎచ్చెర్ల మండలం రుప్పపేట గ్రామానికి చెందిన రుప్ప వెంకటరమణ, జలుమూరు మండలానికి చెందిన వాన జడ్డన్న, టెక్కలి గ్రామానికి చెందిన ఇప్పిలి రాములపై కేసు నమోదు చేశామని తెలిపారు. పశువుల అక్రమ రవాణా నేరమని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా సురేష్‌కుమార్ నియ