
విద్యుత్ స్తంభాల పరిశీలన
సంతబొమ్మాళి: రొయ్యల చెరువుల కోసం పంట పొలాల్లో వేసి న విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ జేఈ శివకుమార్, మండల విద్యుత్ శాఖ ఏఈ శశిభూషణరావు సోమవారం పరిశీలించారు. పంట పొలాల్లో దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు అనే శీర్షికన ఆదివారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఆయా రైతులు, రొయ్యల వ్యాపారితో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆర్డీవో, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని విద్యుత్ శాఖ జేఈ శివకుమార్ తెలిపారు.

విద్యుత్ స్తంభాల పరిశీలన