
గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని పలు యాజ మాన్యాల గురుకుల పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో చక్కటి ఉత్తీర్ణత సాధించారు.
● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గు రుకులాల్లో ఈ ఏడాది 525 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కాగా475 మంది పాసయ్యారు. ఫస్ట్‌క్లాస్ 398 మందికి వచ్చింది.
● మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో 547 మంది పరీక్ష రాయగా 516 మంది పాసయ్యారు. 477 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది.
● బీసీ వసతి గృహాల్లో ఈ ఏడాది 958 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 707 మంది పా సయ్యారు. ప్రథమ శ్రేణి 482 మందికి వచ్చింది. ఆరు వసతి గృహాల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి.