
నూతన డీఐఈఓగా సురేష్‌కుమార్
శ్రీకాకుళం అర్బన్: జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారిగా రేగ సురేష్ కుమార్ బుధవారం బాధ్య తలు చేపట్టారు. విజయనగరం జిల్లా గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సురేష్ కుమార్‌ను ఇటీవల రెగ్యులర్ డీఐఈఓగా శ్రీ కాకుళం జిల్లాకు పదోన్నతిపై నియమించారు. ఇప్పటివరకు డీవీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎస్.తవిటినాయుడుకి విజయనగరం జిల్లా రెగ్యులర్ డీఐఈఓగా పదోన్న తి లభించగా, సురేష్ కుమార్ శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. 1992లో సర్వీస్ కమిషన్ ద్వారా కామర్స్ జూనియర్ లెక్చరర్‌గా వృత్తిజీవితం ప్రారంభించిన సురే ష్‌కుమార్ చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం, గజపతినగరంలలో పనిచేశారు. ప్రిన్సిపాల్‌గా పదోన్న తి పొంది ఎస్.కోట, గుమ్మలక్ష్మీపురం, గుర్ల కళాశాల ల్లో పనిచేసి సౌమ్యునిగా పేరుపొంది, అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా డీవీఈఓగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నూతన డీఐఈఓగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌కుమార్‌ను ఆర్‌ఐఓ దుర్గారావు, ప్రిన్సిపాల్స్ భీమేశ్వరరావు, వర్మ, నాగేంద్ర శర్మ, గణపతి వెంకటేశ్వరరావు, కీర్తి తవిటినాయుడు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రతినిధులు తదితరులు కలిశారు.