
● సూపర్‌సిక్స్ పేరిట జనం చెవిలో పువ్వులు పెట్టారు ● జి
జి.సిగడాం: ఎన్నికల ముందుకు కూటమి నాయకులు అనేక హమీలు ఇచ్చి గద్దెనెక్కాక అమలు చేయకుండా ప్రజల చెవిలో పువ్వులుపెట్టారని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పుతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. గురువారం జి.సిగడాం రైల్వేస్టేషన్ సమీపంలో మండల నూతన కార్యవర్గ సభ్యులతో విస్తృత స్థాయి సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా ఇంతవరకు పేదల కోసం ఒక్క సంక్షేమం పథకం అమలు చేయలేదన్నారు. ప్రజల ను మోసగించడమే చంద్రబాబు నైజమని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంద పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యతిరేక విధా నాలపై ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. గ్రామస్థాయిలో సైనికుల్లా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సనాతన ధర్మ ప్రతినిధి ఎక్కడ?
సనాతన ధర్మం ప్రతినిధిగా కోసం గొప్పలు చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుపతి లో గోవులు మృత్యువాత, శ్రీకూర్మంలో నరక్షేతాల తాబేళ్ల మృత్యుత వాతం పడితే ఎందుకు నోరు విప్పడం లేదని కిరణ్ ప్రశ్నించారు. కార్యక్రమంలో పా ర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణారావు, జిల్లా అధికార ప్రతినిధి సనపల నారాయణరావు, జిల్లా కార్యదర్శి పేడాడ శ్రీరామమూర్తి, కార్యవర్గ సభ్యులు పిల్లల శివకుమార్, మండల పరిషత్ ప్రత్యేకాహ్వానితుడు మీసాల వెంకటరమణ, రొక్కం బాలకృష్ణ, జెడ్పీటీసీ కాయల రమణ, మీసాల సీతంనాయుడు, వైస్ ఎంపీపీలు మీసాల సాధ్వీమణి, తోలేటి వెంకటరావు, మండల పార్టీ అధ్యక్షులు డోల వెంకటరమణ, బోర సాయిరాం, దన్నాన రాజినాయుడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.