
శ్రీయోగానందుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్థపన తిరుమంజనం, సహస్రనామారాధన, అభిషేకాలు, అర్చనలు, విశేషపూజలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుడిపల్లి మధుకర్‌రెడ్డి, ధర్మకర్త రాగి అనిల్, ఈఓ వై.శ్రీనివాస్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి, బైరబోయిన మహరాజు, సైదులు, బైరబోయిన రామలింగయ్య, కనుకు శ్రీనివాస్, మహేష్, అర్చకులు రాంబాబుఅయ్యంగార్, పవన్‌కుమార్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
లింగ వివక్షలేని
సమాజాన్ని స్థాపిద్దాం
భానుపురి (సూర్యాపేట): లింగ వివక్ష లేని సమాజ స్థాపనకు మహిళలు పోరాడాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో దంతాల పద్మరేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా దేశగాని హేమలత, కార్యదర్శిగా పొదిల వెంకటమ్మ, గౌరవ అధ్యక్షురాలిగా మల్లేశ్వరి, ఉపాధ్యక్షులుగా దంతాల పద్మరేఖ, సహాయ కార్యదర్శి కంభంపాటి నాగమణి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొమ్మగాని శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దంతాల రాంబాబు, కోటమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.

శ్రీయోగానందుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment